త్రిష ఎంగేజ్మెంట్ గిఫ్టు విలువ రూ. 7 కోట్లు?
హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష త్వరలో నిర్మాత వరుణ్ మనియన్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే త్రిష ఎంగేజ్మెంట్ కూడా జరుగబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ‘నా ఫ్రెండ్స్, నా అభిమానులు మరియు మీడియాకు నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. జనవరి 23న వరుణ్ తో నా ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేటుగా నా కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. నా పెళ్లి డేట్ గురించి ఎలాంటి వార్తలు రాయొద్దు. ఇంకా ఫిక్స్ కాలేదు. డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తాను.' అని ట్వీట్ చేసింది.
ఎంగేజ్మెంట్ సందర్బంగా త్రిష అత్యంత ఖరీదైన గిఫ్టు అందుకోనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ఆమెకు రూ. 7 కోట్ల విలువ చేసే జెట్ బ్యలాక్ కలర్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తోలుస్తోంది. కట్టుకునే వాడు ధనవంతుడైతే ఇలాంటి గిఫ్టులు కొనివ్వడంలో వింతేమీ లేదులెండి. మొత్తానికి త్రిష కోరుకున్న విధంగా మరింత లగ్జరీ లైఫ్ గడపబోతోందన్నమాట.

పెళ్లి తర్వాత కూడా త్రిష సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ‘నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు ఏమీ చెప్పలేదు. మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేయబోతున్నాను. ఈ సంవత్సరం విడుదలయ్యే నా సినిమాలపై దృష్టి సారించాను' అని త్రిష స్పష్టం చేసింది.
తనకు కాబోయే తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటం, తన కోరికలను, అలవాట్లను అర్థం చేసుకునే వాడు కావడంతో ఆమె హ్యాపీగా ఉంది. ఇటీవలే అతనితో కలిసి నార్తిండియా టూర్ కూడా ఎంజాయ్ చేసింది త్రిష. కాబోయే భార్య త్రిష, ఆమె స్నేహితులను వరుణ్ మణియన్ లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. అంతా కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ తో పాటు ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలు సందర్శించారు.


Click it and Unblock the Notifications











