Just In
- 40 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 55 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- News
శకటాల పరేడ్ వర్సెస్ ట్రాక్టర్ల నిరసన ప్రదర్శన: గణతంత్ర చరిత్రలో తొలిసారిగా: అసలు నిర్వచనం
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లికి ముందే త్రిష-వరుణ్ మనియణ్ అలా...?
హైదరాబాద్: హీరోయిన్ త్రిష పెళ్లి ఖారైన సంగతి తెలిసిందే. తమిళ వ్యాపార వేత్త, సినిమా నిర్మాత అయిన వరుణ్ మణియన్‌తో ఈ నెల 23న వివాహ నిశ్చితార్థం కూడా జరుగబోతోంది. చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నిశ్చితార్థ వేడుక జరుగనుంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
కాగా...మరుసటి రోజు(జనవరి 24)న సౌతిండియాలోని సినీ ప్రముఖులందరినీ పిలిచి భారీగా విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అందరికీ స్వయంగా ఫోన్లు చేసి తప్పకుండా రావాలంటూ ఆహ్వానాలు పలుకుతోందట త్రిష. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ పెళ్లికి ముందే ఇంత పెద్ద విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
‘నా ఫ్రెండ్స్, నా అభిమానులు మరియు మీడియాకు నేను ఓ విషయం చెప్పదలచుకున్నాను. జనవరి 23న వరుణ్ తో నా ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేటుగా నా కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. నా పెళ్లి డేట్ గురించి ఎలాంటి వార్తలు రాయొద్దు. ఇంకా ఫిక్స్ కాలేదు. డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తాను.' అని నిశ్చితార్థం గురించి ట్వీట్ చేసింది.

ఎంగేజ్మెంట్ సందర్బంగా త్రిష అత్యంత ఖరీదైన గిఫ్టు అందుకోనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ఆమెకు రూ. 7 కోట్ల విలువ చేసే జెట్ బ్యలాక్ కలర్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తోలుస్తోంది. కట్టుకునే వాడు ధనవంతుడైతే ఇలాంటి గిఫ్టులు కొనివ్వడంలో వింతేమీ లేదులెండి. మొత్తానికి త్రిష కోరుకున్న విధంగా మరింత లగ్జరీ లైఫ్ గడపబోతోందన్నమాట.
పెళ్లి తర్వాత కూడా త్రిష సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ‘నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు ఏమీ చెప్పలేదు. మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేయబోతున్నాను. ఈ సంవత్సరం విడుదలయ్యే నా సినిమాలపై దృష్టి సారించాను' అని త్రిష స్పష్టం చేసింది.
తనకు కాబోయే తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటం, తన కోరికలను, అలవాట్లను అర్థం చేసుకునే వాడు కావడంతో ఆమె హ్యాపీగా ఉంది. ఇటీవలే అతనితో కలిసి నార్తిండియా టూర్ కూడా ఎంజాయ్ చేసింది త్రిష. కాబోయే భార్య త్రిష, ఆమె స్నేహితులను వరుణ్ మణియన్ లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. అంతా కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ తో పాటు ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలు సందర్శించారు.