ఎం.ఎస్.రాజు చిత్రంలో ఖరారైన త్రిష
ఎన్టీఆర్ తో చేసిన దమ్ము ప్లాప్ కావటంతో ఆమెకు ఆ తర్వాత తెలుగులో ఏ ఆఫరూ రాలేదు. ప్రస్తుతం ఆమె విశాల్ తో సమర్ అనే చిత్రం మాత్రమే చేస్తోంది. సమర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. అప్పటి సినిమాల్లో ఏదైనా రెండు మూడు సన్నివేశాలకే ట్విస్ట్ లు పరిమితం. ఇప్పుడు అలాంటివి మొదటి నుంచి చివరిదాకా లేకుంటే జనం ఆదరించడంలేదు.అప్పుడే తిరు వినిపించిన 'సమర్' కథ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథాపరంగా వూటీలో ప్రారంభమై 15 నిమిషాల్లోనే బ్యాంకాక్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు మరిన్ని మలుపుల్ని అందిస్తాయి అన్నారు.
సమర్ లో తనతో నటించిన విశాల్ గురించి చెపుతూ... వాస్తవానికి 'భరణి'లోనే మేమిద్దరం కలసి నటించాల్సింది. ఆపై కూడా పలు సినిమాలకు విశాల్ పేరును పరిశీలించినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు 'సమర్'లో ఆడిపాడాం. ఇందులో మా ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి. ఇద్దరినీ మంచి మిత్రులను చేసిన చిత్రం కూడా ఇదే అంది.
గతంలో ఎమ్ ఎస్ రాజు బ్యానర్ లో త్రిష మూడు చిత్రాలు చేసింది. ఆ బ్యానర్ లో ఆమె చేసిన వర్షం చిత్రం సూపర్ హిట్టైంది. ఆ సినిమాతో తెలుగులో ఆమె లాంచ్ అయ్యింది. అలాగే ఆ తర్వాత ఆమె సిద్దార్ద తో చేసిన నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రం కూడా మెగా హిట్టై తెలుగులో ఆమెకు కెరీర్ నిలబడేలా చేసింది. ఆ తర్వాత చేసిన పౌర్ణమి చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఆమె ఏ చిత్రమూ చేయలేదు. చిరకాలం గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ లో చిత్రం రావటంతో ట్రేడ్ లో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












