విశాల్‌తో రొమాన్స్‌కు త్రిష గ్రీన్ సిగ్నల్
ఇది వరకు విశాల్ తో నటించడానికి నో చెప్పిన త్రిష మనసు మార్చుకుంది. ఎట్టకేలకు విశాల్‌తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరు దర్శకత్వంలో త్వరలో రాబోతున్నతమిళ సినిమాలో విశాల్‌తో కలిసి ఈ చెన్నయ్ చిన్నది రొమాన్స్ చేయనుంది. విశాల్ స్వయంగా వెళ్లి మరీ త్రిషను ఒప్పించాడట. కథ కూడా నచ్చడంతో విశాల్ కోరికను కాదనలేక పోయిందని తెలుస్తూంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది.
అంతకు ముందు విశాల్ 'సత్య" సినిమాలో అడ్వాన్స్ పేమెంట్ తీసుకుని మరీ...డేట్లు కుదరడం లేదని హ్యాండిచ్చింది . దీంతో త్రిష విశాల్ ను రిజక్ట్ చేసిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీన్ని అవమానంగా భావించిన విశాల్ పరువు పోయిన చోటే మళ్లీ రాబట్టకోవాలని కృత నిశ్చయంతో త్రిషను ఒప్పించి మరీ తన పంతం నెగ్గించుకున్నాడు. దీని తర్వాత విశాల్ 'తీరద విలయాట్టు పిళ్లై సినిమా లో నటించ బోతున్నాడు.


Click it and Unblock the Notifications











