తనకు మ్యారేజీ ప్రపోజల్ వచ్చిందని చెప్పుకుంటున్న త్రిష
తనకు మ్యారేజీ ప్రపోజల్ వచ్చిందని ఆందాల త్రిష తెగ చెప్పుకుంటోంది. ఆ ప్రతిపాదనకు త్రిష తెగ ఆశ్చర్యపడిపోయిందటన. కమల్ హాసన్ తో ఆమె ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర యూనిట్ తో తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి చెబుతోంది. అమెరికాలో ఉంటున్న సత్య అనే వైద్యుడు తనకు ఈ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు ఆమె తెలిపింది. ఇంటర్నల్ మెడిసిన్ లో అతను ఎండి చేశాడు. అతను త్రిష ఇంటికి ఓ మధ్యవర్తిని కూడా పంపాడట. అయితే, త్రిష కుటుంబ సభ్యులు అవునని గానీ కాదని గానీ చెప్పలేదు. తాను మరో ఏడాది పాటు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడట. అయితే నిశ్చితార్థం మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలోనే జరగాలని అతను అడుగుతున్నాడట.


Click it and Unblock the Notifications











