త్రిష ముక్కుతో చెలగాటం - వద్దంటున్నఫ్యాన్స్
బాలీవుడ్ కి వెళ్ళాక త్రిషకి తన ఫిజిక్ లో సరికొత్త మార్పులు చేసుకోవాలనుకుంటోందిట. ప్రధానంగా తన ముక్కు మీద త్రిషకి ఈ మధ్య అయిష్టత పెరిగి పోతోందిట. అందుకేనేమో..ముక్కుని సర్జరీ ద్వారా మరింత నాజూగ్గా తయారు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నానంటూ ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది త్రిష.
అయినా త్రిషకి ముక్కు బాగానే ఉంటుంది కదా. అని సౌత్ ఇండియన్ జనం అనుకుంటుంటే, త్రిష మాత్రం తన ఫిజిక్ లో వీక్ నెస్ ల సంగతి తనకు తెలియదా..?అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. 'కట్టామీటా" తర్వాతి సినిమాకి సిరికొత్త ముక్కు షేప్ తో కన్పిస్తానని చెబుతోంది త్రిష. బాలీవుడ్ వెళ్ళాక నిన్నటితరం హీరోయిన్ శ్రీ దేవి సైతం ఇలాగే ముక్కుకు సర్జరీ చేయించుకున్న సంగతి విదితమే.


Click it and Unblock the Notifications











