హండ్రడ్ పర్సెంట్ నచ్చితేనే-డిసైడ్ చేసేసిన త్రిష...
చెన్నయ్ సోయగం త్రిష తన కెరీర్ కి సంబంధించి ఈమధ్య ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, వచ్చిన సినెమానల్లా ఒప్పేసుకోకూడదని..! తాను ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్ళయిందనీ, అందులో ఏడేళ్ళ పాటు తన కెరీర్ ఊపిరి సలుపుకోలేనంతగా బిజీ బిజీగా గడిచిందనీ, ఇక ఇప్పుడు కాస్త రిలాక్సేడ్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాననీ ఈ చిన్నది చెబుతోంది. కథ, అందులో తన పాత్ర హండ్రడ్ పర్సెంట్ నచ్చితేనే ఒప్పుకుంటున్నాననీ, అందులో ఎలాంటి మొహమాటం లేదనీ అంటోంది.త్రిష అలా నిజానిజాలు చెప్పేస్తూ ఫ్యాన్స్ ని ఆశ్చర్య పరుస్తోంది. 'నరసింహా' సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర లాంటి పాత్ర చేయాలన్నది తన కోరికంటోంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' సినిమాలో నటిస్తున్నందుకు త్రిష ఫుల్ ఖుషీగా వుంది. దమ్ము" స్క్రిప్ట్ వినగానే అందులో మంచి దమ్మున్నదనిపించింది. అంతే కాకుండా ఈ చిత్రంలో నా పాత్ర కూడా కొత్తగా వుంది అందుకే మరో ఆలోచన లేకుండా 'దమ్ము"లో నటించడానికి అంగీకరించాను. తారక్ తో కలిసి నటించడం ఇదే తొలిసారి. తొలిసారి తారక్‌తో కలిసి నటిస్తున్నందుకు ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెరీర్ ఇక అయిపోతోందనుకుంటున్న దశలో ఇలాంటి ఆఫర్ రావడం ఆమెను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.


Click it and Unblock the Notifications











