»   » హీరోయిన్ త్రిష కోరిక ఇప్పటికీ తీరలేదు, ఆయనే కావాలంటోంది!

హీరోయిన్ త్రిష కోరిక ఇప్పటికీ తీరలేదు, ఆయనే కావాలంటోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష... సౌత్ సీని పరిశ్రమలో పరిచయం అక్కర్లేని స్టార్. 17 ఏళ్ల తన సినీ కెరీర్లో తెలుగు, తమిళంలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన ఘనత ఆమెది. పరిశ్రమలో పోటీని తట్టుకుంటూ ఇంత లాంగ్ పీరియడ్ సక్సెస్ పుల్ గా కెరీర్ కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు.

కెరీపరంగా ఆమెకు ఎలాంటి అసంతృప్తి లేదు. దాదాపు అన్నిరకాల సినిమాలు, పాత్రలు చేసింది. 33 ఏళ్ల త్రిషకు ఓ విషయంలో మాత్రం ఇంకా అసంతృప్తి అలానే ఉందట. అది మరేదో కాదు.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించే అవకాశం దక్కక పోవడమే.

ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ...ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ లో అందరూ స్టార్ హీరోలతో నటించాను. ఎంతో మంది యంగ్ స్టార్స్ తో జత కట్టాను. అయితే రజనీకాంత్ గారితో నటించే అవకాశం ఇప్పటికీ రాకపోవడంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

సినిమాల్లోకి రాక ముందు నుండే రజనీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వీరాభిమానిని. సినిమాల్లోకి వచ్చాక ఆయనతో అవకాశం వస్తే బావుండు అని చాలా సార్లు అనిపించింది. అయితే 17 కెరీర్లో నాకు ఇప్పటి వరకు అలాంటి అవకాశం దక్కలేదు. ఆ ఒక్క కోరిక తీరితే నా కెరీర్ సంపూర్ణం అయినట్లు భావిస్తాను అని త్రిష చెప్పుకొచ్చారు.

త్రిష చెప్పిన మరిన్ని వివరాలు..

ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్

ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్

ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కెరీర్లో చాలా చేసాను. చాలా మంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లతో పని చేసాను అని త్రిష తెలిపారు.

గ్లామర్ రోల్స్ గురించి

గ్లామర్ రోల్స్ గురించి

సినిమా స్క్రిప్టు, పాత్ర నచ్చితే ఎలాంటి గ్లామర్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధమే అని త్రిష తెలిపారు.

హారర్-కామెడీస్

హారర్-కామెడీస్

త్రిష ఈ మధ్య కాలంలో చాలా హారర్ కామెడీ సినిమాలు చేసింది. అయితే వరుసగా అలాంటి సినిమాలే వస్తుండటంతో కొంతకాలం వరకు ఇలాంటి జేనర్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోంది.

17 ఏళ్లు..

17 ఏళ్లు..

దాదాపు 17 సంవత్సరాల పాటు ఒక హీరోయిన్ పరిశ్రమలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఇంత కాలం తాను కొనసాగడానికి ప్రేక్షకుల అభిమానమే కారణమని త్రిష తెలిపారు.

అదృష్టం కూడా..

అదృష్టం కూడా..

పరిశ్రమలో రాణించాలంటే కేవలం అందం, టాలెంట్ ఉంటే సరిపోదు.... అదృష్టం కూడా ఉండాలి. ఈ విషయంలో నేను వెరీ లక్కీ అని త్రిష చెప్పుకొచ్చారు.

తర్వాతి సినిమాలు

తర్వాతి సినిమాలు

త్రిష నటించిన తమిళ చిత్రం ‘కోడి' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో పాటు భోగి, మోహిని చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Actress Trisha Krishnan, who has woven a successful career for herself in the competitive world of Tamil cinema, is largely happy about how things have panned out in the last 17 years since her debut. But the 33-year-old has just one regret. Despite being one of the most successful actresses in the Tamil film industry for such a long period of time, the Yennai Arindhaal girl is not happy about one thing - not sharing screen space with superstar Rajinikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu