»   » త్రిషకు SIIMA-2013 స్పెషల్ అవార్డ్ (ఫోటోలు)

త్రిషకు SIIMA-2013 స్పెషల్ అవార్డ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష దాదాపుగా పదేళ్లు సౌతిండియా సీనీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో త్రిష ప్రధాన భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో సినీరంగంలో త్రిష కృషికి‌గాను 'సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013' కార్యక్రమంలో ఆమెను 'టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' అవార్డుతో సత్కరించారు.

తనకు రాబోతున్న SIIMA పురస్కారం గురించి ఆగస్టు 29న త్రిష తన ట్విట్టర్ పేజీలో వెల్లడించింది. ఈ అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసిన త్రిష ప్రేక్షకుల ఆదరణ వల్లనే తాను ఈ స్థాయికి చేరుకుని ఈ అవార్డు అందుకున్నట్లు వెల్లడించింది.

'జోడి' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన త్రిష ఇప్పటి వరకు 50 తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. గతంలోనూ త్రిష తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా పలు అవార్డులు సొంతం చేసుకుంది. స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు....

టాలీవుడ్లో త్రిష ఎంట్రీ..

టాలీవుడ్లో త్రిష ఎంట్రీ..

1999తమిళ చిత్రం జోడీ చిత్రంతో ఓ చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించిన త్రిష...2002లో సూర్య హీరోగా వచ్చిన తమిళ చిత్రం Mounam Pesiyadheతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఐదు తమిళ చిత్రాల తర్వాత ‘నీమ మనసు నాకు తెలుసు' అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

వర్షంతో తొలి విజయం

వర్షంతో తొలి విజయం

ప్రభాస్ హీరోగా వచ్చిన తెలుగు చిత్రం ‘వర్షం'లో నటించిన త్రిష కెరీర్లో తొలి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి గాను త్రిష ఉత్తమ నటి విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

వర్షం చిత్రం తర్వాత త్రిష తెలుగులో నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. దీంతో త్రిషకు స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఈ సినిమాకు కూడా ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

మహేష్ బాబుతో అతడు

మహేష్ బాబుతో అతడు

వరుస సక్సెస్‌లతో ఉన్న త్రిషకు తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు సరసన ‘అతడు' సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో త్రిష నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది.

తెలుగు అగ్రహీరోలందరితో...

తెలుగు అగ్రహీరోలందరితో...

వరుస విజయాలు వరించిన తర్వాత త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిరంజీవి, నాగార్జున, రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్ ఇతర స్టార్ హీరోలతో కూడా నటించింది.

వివిధ అవార్డులు

వివిధ అవార్డులు

15 ఏళ్ల యాక్టింగ్ కెరీర్లో త్రిష అనేక అవార్డులు సొంతం చేసుకుంది. ఐటిఎఫ్ఎ, సంతోషం, సిని‘మా', వంశీ, నంది, టిఎన్ఎస్ఎఫ్, జెఎఫ్‌డబ్ల్యు, రిట్జ్ ఐకాన్, విజయ్ అవార్డులు ఆమెకు దక్కాయి. 2012లో యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ సినిమా అవార్డు కూడా దక్కించుకుంది.

త్రిషకు సైమా-2013 స్పెషల్ అవార్డు

త్రిషకు సైమా-2013 స్పెషల్ అవార్డు

కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న త్రిషకు....తాజాగా 2013లో 10 ఇయర్స్ ఆఫ్ ఇన్ సినిమా అవార్డు కూడా దక్కడంపై ఎంతో ఆనందంగా ఉంది.

ఇప్పటికీ బరిలోనే...

ఇప్పటికీ బరిలోనే...

ఈ కాలం హీరోయిన్లు ఇన్నేళ్లు ఇండస్ట్రీలో స్టాండ్ అవడం అంటే ఆశ్చర్యమే. ఇప్పటికీ త్రిష పలు సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది.

త్రిష ‘రమ్'

త్రిష ‘రమ్'

ప్రస్తుతం త్రిష ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RUM(రంభ, ఊర్వశి, మేనక) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.

English summary
Actress Trisha Krishnan has ruled South Indian film industry for over a decade and has several hits to her credit. Now, she has been honoured with the 10 Years Of Excellence In Cinema award on the first day of the second edition of South Indian International Movie Awards (SIIMA) 2013 held in Dubai between September 12 and 13. She looked all contented as she walked with this honour on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu