ఆశ్చర్యం: పాకిస్థాన్‌లో త్రిష హోర్డింగులు (వీడియో)
హైదరాబాద్: హీరోయిన్ త్రిష సౌతిండియాలో ఫేమస్ హీరోయిన్. తెలుగు తమిళంలో ఆమె అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోనూ నటించింది. అంతకు మించి ఆమె మన దేశ బోర్డర్ దాటి మాత్రం నటించలేదు.
అయితే త్రిష ఫోటోతో కూడిన హోర్డింగులు పాకిస్తాన్‌లోని పెషావర్ సిటీలో దర్శనిమిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే......ఓ 3డి గేమ్‌కు సంబంధించిన అడ్వర్టెజ్మెంటులో పాకిస్తాన్‌లోని పెషావర్ త్రిష ఫోటోతో కూడిన హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఆమె ఎవరనేది ఇతరులెవరూ గుర్తు పట్టుక పోయినా....సౌతిండియన్స్ మాత్రం పెషావర్ సిటీలో ఆమె ఫోటో చూసి ఆశ్చర్య పోతున్నారు.

త్రిష సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం త్రిష తెలుగులో బాలయ్య సరసన సత్య దేవా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో భూలోహం, తాలా 55, మణిరత్నం ప్రాజెక్టులో, సురజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో అవకాశాలు దక్కించుకంది.
కొత్త ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ హీరోయిన్ త్రిష:క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











