ఆమె హాట్..అతడు కూల్..బ్రహ్మానందం ఫూల్
"ఆమె హాట్..అతడు కూల్..మధ్యలో ఫూల్" ఈ విచిత్రమైన క్యాఫ్షన్ తో 'నమో వెంకటేశ' చిత్రం పోస్టర్స్ ని డిజైన్ చేసారు. త్రిష హాట్ అని, వెంకటేష్ కూల్ అనీ, మధ్యలో బ్రహ్మానందం ఫూల్ అని బొమ్మలు వేశారు. పూర్తి స్ధాయి కామెడి చిత్రం అని అర్ధమయ్యేటట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్స్ అంతటా మంచి ప్రంశంసలు పొందుతున్నాయి. అలాగే ట్రైలర్స్ సైతం విభిన్నంగా రూపొందించి అన్ని వర్గాలను టార్గెట్ చేసారు. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం ప్యారిస్ ప్రసాద్ గా వెంకటేష్ తో సమానమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం..అలాగే ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిక్వాలిజం చేస్తూ కనపడతారు. ఆయన పాత్ర ఎంజాయబుల్, లవబుల్ క్యారెక్టరేజేషన్ తో నడుస్తుంది. కొంచెం అమాయకంగా కనిపిస్తూ, ఇంటెలిజెన్స్ చూపించే పాత్ర. సినిమా విషయానికొస్తే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హాలీవుడ్ సినిమా 'సిండ్రెల్లా' టైప్ సింపుల్ లవ్ స్టోరీ.
ఫస్టాఫ్ ఫారిన్‌లో, సెకండాఫ్ ఇక్కడా కథ నడుస్తుంది. కథలో వెంకటేష్ విదేశాలలోని తెలుగు వారి ఆహ్వానం మేరకు ప్యారిస్ వెళ్లతాడు. అక్కడ బ్రహ్మానందం కలుస్తాడు. అతని మేనకోడలు త్రిష. ఇక వీరిని ఆహ్వానించి,అక్కడ పోగ్రామ్ లు చూసే ఆర్గనైజర్ గా బ్రహ్మానందం బిల్డప్ లు ఇస్తూ వెంకటేష్ తో ఆడుకుంటాడు. పూర్తి స్ధాయి కామిడీ పండిస్తాడు. ముఖ్యంగా సెకెండాఫ్ లో బ్రహ్మానందం, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉంటాయని, రెగ్యులర్ గా శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే త్రాగుడు సీన్ కూడా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు. సంక్రాతికి దీనిని రిలీజ్ చేసి నవ్వులు పండించనున్నారు.


Click it and Unblock the Notifications











