అదీ అసలు విషయం: త్రిష, వరుణ్, రానా పార్టీ చేసుకున్నారు
హైదరాబాద్: సౌత్ హీరోయిన్ త్రిష, రానా మధ్య ఎఫైర్ ఉందంటూ గత కొన్నేళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ ఎన్నిసార్లు ఖండించినా పుకార్లకు మాత్రం తెర పడలేదు. తాజాగా త్రిష పెళ్లి ఖరారు కావడంతో రానా-త్రిష మధ్య ఏమీ లేదనే విషయం స్పష్టమైంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా ఈ విషయమై రానా స్పందిస్తూ...ఇన్నాళ్లు మా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకని అనవసర రాద్దాంతం చేసారు. త్రిష వివాహం ఖరారయ్యే వరకు అసలు విషయం ఎవరూ అర్థం చేసుకోలేదు. త్రిష, నేను ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. వరుణ్ మణియన్ తో కూడా మంచి స్నేహం ఉంది. అంతా కలిసి ఒకసారి గోవాలో పార్టీ కూడా చేసుకున్నామని రానా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నేను సింగిల్. ఎవరితో మింగిల్ కావడానికి సిద్ధంగా లేను. నా దృష్టంగా కెరీర్ మీదనే ఉంది. ప్రేమ, పెళ్లి అనేవి సమయం వచ్చినపుడు వాటంతట అవే జరిగిపోతాయి అని రానా చెప్పుకొచ్చారు.

త్రిష వివాహం
తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష వివాహం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 23న వీరి నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుక కోసం ఇరు కుటుంబాల వాళ్లు సన్నాహాలు మొదలుపెట్టారట. నిశ్చితార్థం వేడుక తేదీని ప్రకటించిన త్రిష వివాహ తేదీని మాత్రం ప్రకటించలేదు.
నిశ్చితార్ధానికి ఆమె కాబోయే భర్త వరుణ్ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 7కోట్ల రూపాయల ఖరీదైన రోల్స్ రాయ్స్ కారును బహుమతిగా త్రిష అందుకోబోతుందని మీడియాలో గుప్పుమంది. అయితే ఈ విషయమై ఆమె కాబోయే భర్త వరుణ్ కొట్టి పారేస్తున్నారు. అలాంటిదేమీ లేదని అన్నారు.


Click it and Unblock the Notifications











