ఎన్టీఆర్, నాగార్జున సరసన త్రిష

ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ వంటి వారి సరసన నటించింది. నాగార్జున, ఎన్టీఆర్ ల చిత్రాల్లోనే ఆమె నటించలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించబోతున్న చిత్రంలోనూ త్రిష నటించబోతోంది.
త్రిష ఈ ఏడాది మరింత బిజీ కానుంది. తమిళంలోనూ ఆమె అనేక సినిమాలను ఒప్పుకుంది. ఇప్పటి వరకు తమిళంలో హవా నడిపించిన శ్రియ ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ కావడంతో త్రిషకు తమిళ సినిమాలు పెరిగాయి. నయనతార కు తెలుగు అవకాశాలు తగ్గడంతో ఆ అవకాశాలు త్రిష పరమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











