నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం అంటూ అందాల భామ త్రిష ఎడాపెడా స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తోంది. అంతేగాక ఆ పాత్రలు ఎలా ఉండాలో కూడా చెప్పేస్తోంది. నరసింహా లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి టైప్ గానీ,గుప్త్ సినిమాలో కాజల్ చేసిన విలన్ పాత్రల వంటివి కావాలంటోంది. కానీ దర్శక,నిర్మాతలు ఎవరూ కూడా అటువంటి ఛాలెంజింగ్ పాత్రలు ఆమెకు ఆఫర్ చేయటం లేదట. ఇంతకు ముందు ఫలానా గుడ్డి పాత్ర, లేదా వసంత కోకిలలో శ్రీదేవి లాంటి మతిలేని పాత్రలు డ్రీమ్ రోల్స్ గా చెప్పేవారు. అయితే ఇప్పడు కాలం మారి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని సీనియర్స్ అంటున్నారు. అయినా మరెవరెన్నా త్రిష మాటలు విని నమ్మి అలాంటి పాత్రలు రెడీ చేసికెళ్ళితే డేట్స్ దొరకొచ్చు.అయినా అంతగా కాకపోతే గుప్త్ సినిమానే రీమేక్ చేస్తే సరి.