బికినీ ట్రెండ్ గురించి ఓపెన్ గా త్రిష
హానెస్ట్ గా చెప్పాలంటే..మొత్తం బికినీ ట్రెండ్ మొత్తం ఓ పెద్ద జోక్ లా మారింది. ఎందుకంటే బికినీ అనేది పెద్ద విషయమేమీకాదు...అంటూ ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న బికినీ ట్రెండ్ గురించి త్రిష మాట్లాడింది. అలాగే నా ఉద్దేశ్యంలో మంచి శరీరాకృతి, కథ డిమాండ్ చేస్తే బికినీ వేసుకుంటే తప్పేమీకాదు. అయితే నేను పర్శనల్ గా బికినీ ధరించటానికి కంఫర్ట్ గా ఉండను. కాబట్టే మీకు బికినీలో కనిపించటం కష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఆమె నటించిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం ఆమె ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన కట్టా మీటా అనే చిత్రంలో చేస్తోంది.
ఇక హిందీ చిత్రాల గురించి మాట్లాడుతూ..హిందీ చిత్రాలకో ఎడ్వాంటేజ్ ఉంది. అక్కడ రకరకాల వెరైటీ ఫిమేల్ రోల్స్ దొరుకుతాయి. చూడండి ప్రియాంకచోప్రా ఫ్యాషన్ లో పాత్ర, అలాగే కమీన్ లో ఆమె పాత్ర ఎంత డిఫెరెంట్ గా ఉంటాయి.అయినా హీరోయిన్స్ ను గ్లామరస్ గా చూపాలనేదే నా ఉద్దేశ్యం. ఎందుకంటే అదేమీ తప్పుకాదు..జనాలు కోరుకునేది మేము గ్లామర్ ఒలకపోయాలనే..నాకు తెలిసినంతవరకూ డీసెంట్ గ్లామర్ అనేది చిత్ర విజయానికి తోర్పరుతుంది. అయినా చిత్ర పరిశ్రమ మగాళ్ళ రాజ్యం..వారి డామినేషన్ అన్ని చోట్లా ఉంటుంది. అలాంటప్పుడు మేం ఫలానా తరహా పాత్ర ధరిస్తాను అనటానికి ఎక్కడ కుదురుతుంది అంటూ నిట్టూర్చింది.


Click it and Unblock the Notifications











