»   » తాప్సీ వదిలేస్తే త్రిష తగులుకుంది

తాప్సీ వదిలేస్తే త్రిష తగులుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాప్సీ తన వల్లకాదని,తాను చేయనని కాదన్న ప్రాజెక్టులోకి త్రిష ఎంటరవ్వటానికి ప్రయత్నిస్తోంది.హిందీలో సూపర్ హిట్టయిన తను వెడ్స్ మను చిత్రం తెలుగు రీమేక్ కోసం మొదట తాప్సీని అడిగితే ఆమె ఓకే చేసింది.అయితే సునీల్ వంటి కామిడీ హీరో ప్రక్కన చేస్తే తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని భావించిన తాప్సీ వెంటనే నో చెప్పేసింది.అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న త్రిష ఓ మంచి రేట్ ఫిక్స్ చేసి కబురెట్టింది.అయితే సునీల్ తో చేస్తున్న బడ్జెట్ కాబట్టి అంత ఇచ్చుకోలేమని మధ్యే రకంగా ఓ రేట్ ని పిక్స్ చేసి త్రిషకు చెప్పటం జరిగింది.ఈ చిత్రాన్ని బ్లేడ్ బాబ్జీ దర్శకుడు దేవిప్రసాద్ డైరక్ట్ చేస్తున్నారు.సూపర్ గుడ్ ఫిల్మ్ వారు నిర్మిస్తున్నారు.

ఈ విషయమై యూనిట్ లోని వారు మాట్లాడుతూ..తను వెడ్స్ మను రీమేక్ కోసం స్క్రిప్టులో చాలా మార్పులు చేసాం.తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కామిడీని సినిమాలో చేర్చాం. అలాగే హీరోయిన్ క్యారక్టరైజేషన్ ని కొద్దిగా మార్చాం.ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే త్రిషను ఆ పాత్ర కోసం సంప్రదించాము.ఆమె ఇంకా ఏ విషయమూ తేల్చలేదు అన్నారు.నిజానికి త్రిష అడిగిన రెండు కోట్లు ఇస్తే ఇమ్మిడియట్ గా డేట్స్ ఇస్తానందిట.అయితే ప్రస్తుతం బేరసారాలు జరుగుతున్నాయి. త్రిష ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతోంది.

English summary
Actor Trisha will be reportedly playing Kangana Ranaut’s role in the Telugu remake of Tanu Weds Manu.She has to be paired opposite comedian-turned-hero Sunil in this film being helmed by director Devi prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu