రానాకు త్రిష ఫోన్.. మిహికాతో పెళ్లిపై రియాక్షన్ ఏమిటంటే

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లి వార్త దక్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. సినీ పరిశ్రమకు పరోక్ష సంబంధాలున్న వ్యక్తి మిహికాను పెళ్లాడుతున్నానంటూ రానా ప్రకటన చేయగానే కొంత షాక్ కలిగించినప్పటికీ.. వెంటనే తేరుకొని అందరూ కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు అందించారు. అయితే రానాకు త్రిషకు మధ్య అఫైర్ ఉందని, వారిద్దరి పెళ్లి చేసుకొంటారనేవార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రానా పెళ్లి ప్రకటన తర్వాత త్రిష కృష్ణన్ రియాక్షన్ ఏమిటంటే..

రానా, త్రిష రిలేషన్

రానా, త్రిష రిలేషన్

రానా, త్రిషల మధ్య బంధం సినిమాలకు అతీతమైనది. వారిద్దరి చెన్నైలో బాల్య స్నేహితులు. వారి మధ్య స్నేహం పరిధి దాటి ప్రేమగా మారిడం, వారిద్దరి మధ్య అఫైర్ చాలా కాలం సాగింది కూడా. సుచీలీక్స్ సందర్భంగా రానా, త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సెన్సేషనల్‌గా మారాయి. వారి ప్రేమ కథ ఇప్పటికీ నడుస్తుందనే విషయాన్ని చెప్పుకొంటారు.

త్రిషాతో డేటింగ్ నిజమే..

త్రిషాతో డేటింగ్ నిజమే..

ఇక రానా కూడా త్రిషతో డేటింగ్ విషయాన్ని పలు సందర్భాల్లో ఒప్పుకొన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. త్రిషాతో రిలేషన్ నిజమే. మా మధ్య కొంతకాలం డేటింగ్ నడించిన మాట వాస్తవమే. ఆ తర్వాత అఫైర్‌కు పుల్‌స్టాప్ పెట్టి ఫ్రెండ్స్‌గానే ఉండాలని అనుకొన్నాం అని రానా చెప్పారు.

రానా కోసమే త్రిష..

రానా కోసమే త్రిష..

గతంలో రానా, త్రిష మధ్య డేటింగ్ సాగిందనేది దక్షిణాది పరిశ్రమలో అందరికి తెలిసిందే. రానా కోసమే తన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకొన్నారనే ఓ వాదన కూడా మీడియాలో వచ్చింది. అయితే కారణాలేమైన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి సింగిల్ గానే త్రిష ఉంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. రానా పెళ్లి విషయం తెలియగానే త్రిష పేరు మళ్లీ మీడియాలో కనిపించింది.

గర్ల్ ఫ్రెండ్స్ గురించి

గర్ల్ ఫ్రెండ్స్ గురించి

ఇక తాజాగా లక్ష్మీ మంచు ఇంటర్వ్యూ సందర్భంగా తన పెళ్లి గురించి, గర్ల్‌ఫ్రెండ్స్ గురించి ప్రస్తావించారు. తన పెళ్లి వార్తపై నా గర్ల్ ఫ్రెండ్స్ సానుకూలంగా స్పందించారు. నేను వారిని అలా మేనేజ్ చేశాను. మిహికాతో పెళ్లి అనగానే వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు అని రానా చెప్పుకొచ్చారు.

Recommended Video

Miheeka Bajaj Revealed The Actual Meaning Behind The Special Tattoo
రానాకు త్రిష ఫోన్ చేసి..

రానాకు త్రిష ఫోన్ చేసి..

ఇక మిహికాతో పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా రానా వెల్లడించగానే.. సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎట్టకేలకూ రానా ఓ ఇంటి వాడు కాబోతున్నందుకు హ్యాపీగా ఫీలయ్యారు. ఈ క్రమంలో త్రిషా కూడా రానాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారట. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారట. మిహికాతో దాంపత్య జీవితం చక్కగా కొనసాగాలని ఆమె దీవెనలను కూడా ఫోనులో అందించినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X