Trisha Krishnan: త్రిషను రేప్ చేయాలనుకున్న నటుడు.. సంచలనంగా మారిన కామెంట్స్.. ఆమె ఏం చేసిందంటే!
సుదీర్ఘ కాలంగా అందానికి అందం, నటనకు నటనతో సౌత్ ఇండియా మొత్తంలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ త్రిష. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషల్లోనూ రాణించింది.
అదే సమయంలో వరుస ఆఫర్లతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'లియో'తో సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై మన్సూర్ అలీ ఖాన్ అనే నటుడు అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీనికి త్రిష ఎలా కౌంటర్ ఇచ్చిందో మీరే చూసేయండి!

లియోతో సెన్సేషనల్ హిట్: సౌతిండియన్ స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవలే 'లియో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇళయదళపతి విజయ్ హీరోగా చేసిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఏకంగా రూ. 600 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. అదే సమయంలో కోలీవుడ్‌లో టాప్ మూవీగానూ నిలిచింది. ఈ సక్సెస్‌తో త్రిష మంచి ఉత్సాహంతో ఉంది.
త్రిషను రేప్ చేయాలంటూ: 'లియో' సినిమాలో నటించిన మన్సూర్ అలీ ఖాన్.. ఆ చిత్రం విజయవంతం అవడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా గురించి తన అనుభవాలను పంచుకోవడంతో పాటు హీరోయిన్ త్రిషపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెను రేప్ చేయాలని అనుకున్నానంటూ కామెంట్లు చేశాడు. దీంతో ఇప్పుడీ అంశం సెన్సేషన్‌గా మారిపోయింది.
మన్సూర్ ఏమన్నాడంటే: తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీ ఖాన్ 'నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో రేప్ సీన్ ఉంటుందని భావించా. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్ పైకి తీసుకెళ్లవచ్చని అనుకున్నా. నేను గతంలో చాలా సినిమాల్లో రేప్ సీన్లు చేశా. ఇది నాకు కొత్త కాదు. అయితే లియో కాశ్మీర్ షెడ్యూల్‌లో త్రిష నాకు కనిపించలేదు' అని కామెంట్స్ చేశాడు.

కామెంట్లపై త్రిష స్పందన: మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో దీనిపై హీరోయిన్ త్రిష కూడా స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ (X) ఖాతాలో 'మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన ఇటీవలి వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి మాటల్లో సెక్సిస్ట్, అగౌరవం, స్త్రీ ద్వేషం కనిపిస్తున్నాయి' అని చెప్పింది.

ఇంకెప్పుడూ చేయనంటూ: అదే ట్విట్‌లో త్రిష 'మన్సూర్ అలీ ఖాన్ ఇలాంటివి కోరుకుంటూనే ఉంటాడు. కానీ, తన లాంటి దారుణమైన వ్యక్తితో ఇంత వరకూ స్క్రీన్ షేర్ చేసుకోనందుకు సంతోషంగా భావిస్తున్నా. నా సినిమా కెరీర్‌లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. ఇలాంటి నీచమైన మెంటాలిటీ ఉన్న వారు మగజాతికే మచ్చ తెస్తారు' అంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది.
ఖండించిన డైరెక్టర్ లోకేష్: త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురయ్యాను. మేమంతా ఒక టీమ్‌లో పని చేశాము. మహిళలు, తోటి కళాకారులు, టెక్నీషియన్ల పట్ల గౌరవంగా ఉండాలి. ఇది ఏ పరిశ్రమలోనైనా కచ్చితం. ఈ వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నా' అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











