»   » ఇదో సెక్స్ కామెడీ!(త్రిష లేదా నయనతార రివ్యూ)

ఇదో సెక్స్ కామెడీ!(త్రిష లేదా నయనతార రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

హైదరాబాద్: యువత సంగీత దర్శకుడు జివి ప్రకాష్ ప్రకాష్ హీరోగా నటించిన తమిళ చిత్రం తాజాగా తెలుగులో ‘త్రిష లేదా నయనతార' పేరుతో విడుదలైంది. తమిళంలో ఈచిత్రం యూత్ ను ఆకట్టుకోవడంతో విజయం సాధించింది. సంగీత రంగం నుండి నటనా రంగంలోకి అడుగు పెట్టిన జీవి ప్రకాష్ ఎలాంటి కథను ఎంచుకున్నాడు, తన పెర్ఫార్మెన్స్ తో ఏ మేరకు మెప్పించాడనేది రివ్యూలో చూద్దాం.

స్టోరీ వివరాల్లోకి వెళితే..
జీవా(జీవి ప్రకాష్) అనే కుర్రాడి చుట్టూ కథ తిరుగుతుంది. మన హీరో ఇద్దరమ్మాయిలతో పాటు పెరుగుతాడు. రమ్య(ఆనంది), అదితి (మనీషా యాదవ్). ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ముగ్గురూ ఒకే రోజు, ఒకే సమయానికి, ఒకే హాస్పటల్ లో జన్మిస్తారు.

కౌమార దశలోకి రాగానే స్కూల్ లో రమ్యతో ప్రేమలో పడతాడు జీవా. ఆమెకు కూడా అతనిపై (కామం?) సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అనుకోకుండా ఇద్దరూ విడిపోతారు. అందుకు కారణం జీవానే. ఓసారి జీవా తన ఫ్రెండుతో తన సెక్సువల్ అనుభవం గురించి చెబతాడు జీవా. ఈ విషయంలో స్కూల్ క్యాంపస్‌లో అందరికీ తెలిసిపోతుంది. రమ్యతో విడిపోయిన తర్వాత.... జీవా అదితికి దగ్గరవుతాడు కానీ ఆమెకు రెగ్యులర్ తాగే అలవాటు ఉంటుంది. దీంతో రెండో ప్రేమ వ్యవహారం కూడా విఫలం అవుతుంది. తర్వాత ఆ జీవా ఊరు విడిచి వేరే ఊరు వెళ్లి తన అంకుల్ వద్ద ఉంటాడు. మరి జీవా జీవితంలోకి మళ్లీ రమ్య వచ్చిందా? లేదా? అనేది తర్వాతి కథ.

పెర్ఫార్మెన్స్...
జీవి ప్రకాష్ తన పాత్రకు తగిన లుక్ తో ఆకట్టుకున్నాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఆనంది గుడ్ లుక్ తో బావుంది. మనీషా యాదవ్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. సినిమాలో కీలకమైన పాత్రలో సిమ్రాన్ కనిపించింది. తన నటనతో మెప్పించింది. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు తగిన విధంగా రాణించారు.

అధిక్ రవిచంద్రన్ స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుర్రాళ్ల వ్యక్తిత్వాన్ని కాస్త రాష్ గా చూపించారు. ముఖ్యంగా మహిళల పట్ల వారి ఆలోచన విధానం చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఇక సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులు భరించడం కష్టమే. అయితే ఈ అంశాలన్ని యూత్ ను ఆకట్టుకుంటాయి. హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందించాడు జీవి ప్రకాష్. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది.

ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే....యూత్‌ను, మాస్ పీపుల్ ను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. సెక్స్ కామెడీ ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు వీలైనంత దూరంగా ఉంటేనే బెటర్ అనే విధంగా ఉంది.

స్టోరీ

స్టోరీ

జి.వి ప్రకష్ తొలుత ఆనందితో ప్రేమలో పడతాడు. తర్వాత ఆమెతో బ్రేకప్ అవ్వడంతో మనిషా యాదవ్ తో ప్రేమలో పడతాడు. ఆమె తాగుబోతు కావడంతో ఆమెకూ దూరం అవుతాడు. తర్వాత మళ్లీ అతని జీవితంలోకి ఆనంది వస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.

సిమ్రన్

సిమ్రన్

ఆనంది ఆంటీ పాత్రలో సిమ్రన్ కనిపిస్తుంది. ఆనంది విషయంలో ప్రకాష్ కి హెల్ప్ చేస్తుంది.

మనీషా

మనీషా

మనీషా యాదవ్ బోల్డ్ రోల్ లో కనిపిస్తుంది. రియాల్టీతో పోలిస్తే ఆమె పాత్ర కాస్త ఓవర్ గానే అనిపిస్తుంది.

అనుమతి

అనుమతి

ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ చేసే సమయంలో త్రిష, నయనతార అనుమతి తీసుకున్నారట.

ప్రకాష్

ప్రకాష్

తన పాత్రకు తగిన విధంగా తయారు కావడానికి కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా డైట్ మెయింటేన్ చేసాడట జీవి ప్రకాష్.

త్రిష లేదా నయనతార

త్రిష లేదా నయనతార

మాస్ ప్రేక్షకులను, యూత్ ను మాత్రమే ఆకట్టుకునే లా సెక్స్ కామెడీ కలగలిపి ఉంది.

మీ అభిప్రాయం

మీ అభిప్రాయం

సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో తెలపండి.

English summary
Trisha Leda Nayanatara shall go well with urbane youth and masses. If you are waiting since a long time to see a sex comedy in Telugu and if bold story telling really interests you, then Trisha Leda Nayanatara is for you. In the other case, you can give it a miss.
Please Wait while comments are loading...