త్రిష ఆ స్టార్ హీరో దృష్టిలో పడటం ఆశామాషి కాదు...!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో నటించాలని వుందట త్రిషకు. బాలీవుడ్ లో ఆ గొప్ప నటుడితో నటించడం తన చిరకాల కోరిక అంటున్నారు ఈ అందాల భామ. ఖట్టా మీఠా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ చేదు అనుభవం ఎదురైనా ఎప్పటికైనా బాలీవుడ్ లో ఓ హిట్ కొడతానని ఆత్మ విశ్వాసంతో ఉన్నారట త్రిష.
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఈ అందాల భామ ద్రుష్టి మొత్తం ప్రస్తుతం అమీర్ ఖాన్ పైనే వుందని తెలిసింది. అమీర్ ఖాన్ ను కలిసి ఆయన దృష్టిని ఆకర్షించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట త్రిష. అయితే మిస్టర్ పేర్ఫెక్టనిస్ట్ గా పిలవబడే అమీర్ ఖాన్ దృష్టిలో పడటమంటే అంత ఆషామాషీ కాదు. లక్కిగా అసిన్ మాత్రం తన తోలి చిత్రానికే ఆ అవకాశాన్ని కొట్టేసింది. ఇక త్రిషను ఆ అదృష్టం ఎప్పుడు వరించనుందో ఏమో.


Click it and Unblock the Notifications











