విషాదం: ప్రియ నేస్తాన్ని కోల్పోయిన హీరోయిన్ త్రిష
హైదరాబాద్: ఎవరైనా ఆత్మీయులు మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ప్రాణంగా పెంచుకున్న జంతువులు పోయినా అదే విధమైన బాధ ఉంటుంది. తాజాగా ఆ బాధ అనుభవిస్తోంది హీరోయిన్ త్రిష. ఆమె ఎంతో ప్రాణంగా పెంచుకున్న కుక్కపిల్ల మరణించింది. పేరు క్యాడ్బరీ, ముద్దుగా క్యాడు అని పిలుచుకుంటుంది త్రిష.
కాడ్బరీ మరణంతో త్రిష చాలా అప్‌సెట్ అయినట్లు ఆమె ట్విట్టర్ వ్యాఖ్యలు బట్టి స్పష్టమవుతోంది. 'నువ్వు లేకుండా ఇకపై ఎలా ఉండాలో తెలియడం లేదు క్యాడు. నువ్వు లేని లోటు తీర్చలేనిది' అంటూ తన సోషల్ నెట్వర్కింగు సైట్లో పేర్కొంటూ ఆ కుక్క పిల్లపై తన ప్రేమను చాటుకుంది త్రిష.

క్యాడ్బరీ అంటే త్రిషకు ఎంత ప్రేమంటే, ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా కూడా దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. క్యాడు మాత్రమే కాదు....మూగ జీవాలంటే త్రిషకు చాలా ఇష్టం. అందుకే 'పెటా' తరుపున వాటి సంరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ తో కలిసి తనవంతు సాయం చేస్తోంది.
ఇక త్రిష సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె తెలుగులో 'రంభ ఊర్వశి మేనక', తమిళంలో 'భూలోగం', 'ఎండ్రెండ్రుమ్ పున్నాగై', 'కన్నాలే కన్నన్' అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఇవి విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











