Just In
- 23 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 42 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- News
కాస్మిక్ గర్ల్: పీఎస్ఎల్వీలు కాదు.. విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం: ఒకేసారి తొమ్మిది
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి డేట్....త్రిష కావాలనే అలా చేస్తోందా?
హైదరాబాద్: సినిమా సెలబ్రిటీలు పెళ్లి విషయంలో నానా యాగీ చేయడం, దాగుడు మూతలు ఆడటం, మీడియాలో హైప్ క్రియేట్ చేయడం....చివరి వరకు విషయం చెప్పకుండా డ్రామా ప్లే చేయడం మామూలే. ఇలా చేయడం వల్ల వారికి ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతుంది. తాజాగా త్రిష కూడా అలానే చేస్తుందనేది చెన్నై టాక్.
గత కొంత కాలంగా త్రిష పెళ్లి విషయం మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి నెలలో త్రిష పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్ మణియన్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతుందని, ఆయనతో నిశ్చితార్థం కూడా ముగిసిందని కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి.

తనకు కాబోయే వాడితో కలిసి ఇటీవల నార్తిండియా టూర్ కూడా ఎంజాయ్ చేసింది త్రిష. కాబోయే భార్య త్రిష, ఆమె స్నేహితులను వరుణ్ మణియన్ లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. అంతా కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ తో పాటు ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలు సందర్శించారు.
కాగా....త్రిష కొత్త సినిమాలను ప్రస్తుతం అంగీకరించడం లేదని, పెళ్లి డేట్ దగ్గర పడుతుండటం వల్లనే ఆమె ఇలా చేస్తుందని అంటున్నారు. పెళ్లి సంబంధించిన హడావుడి ఇప్పటికే వారి ఇంట్లో మొదలైందని, త్రిష తల్లి ఉమ కృష్ణన్ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్. త్వరలోనే త్రిష పెళ్లి విషయం అపీషియల్ గా వెల్లడి కానుంది.