ఇమేజ్ కంటే స్టార్ డమ్ అంటేనే ఇష్టం: త్రిష
అందాల ముద్దుగుమ్మ త్రిష కొద్ది కాలం గ్యాప్ తర్వాత తెలుగులో తాజాగా వెంకటేష్ సరసన 'గంగ" (ది బాడీగార్డ్) చిత్రంలో నటిస్తోంది. చక్కటి అభినయంతో స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిన మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ భామ యువ కథానాయికల జోరులో ఈ మధ్యకాలంలో కొంత వెనకబడిపోయింది. ఆ మధ్య బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తూ నటించిన 'కట్టామీటా" ఈ సుందరికి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
తాజాగా త్రిష తమిళంలో నటించిన 'మంగతా" (తెలుగులో 'గ్యాంబ్లర్") కమర్షియల్ విజయాన్ని సాధించడంతో కొత్త ఉత్సాహంతో వుంది ఈ సుందరి. అభినయ ప్రధాన పాత్రల్ని పోషిస్తే నటిగా అందరిలో మంచి గుర్తింపు లభిస్తుంది కానీ అవకాశాలు రావాలంటే మాత్రం ఎవరైన స్టార్ డమ్ కాపాడుకోవాలంటోంది ఈ వయ్యారి. 'వైవిధ్యమైన, ప్రయోగాత్మక పాత్రలు చేస్తే నటిగా ఆత్మ సంతృప్తి దొరుకుతుంది. అంతేకాని ఆ పాత్రల ద్వారా లభించిన గుర్తింపు మనకు మరిన్ని అవకాశాల్ని తీసుకువస్తుందనటంలో నిజం లేదు.
నేను మంచి నటి అనే ఇమేజ్ కంటే గొప్ప స్టార్ అనే ఇమేజ్ నే ఎక్కువగా ఇష్టపడతాను. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కు స్టార్ డమ్ చాలా ముఖ్యం" అని విశ్లేషిస్తోంది ఈ భామ. స్టార్ డమ్ కోల్పోయాక ఈ భామకు ఈ విషయం భోదపడిందని సినీ జనాలు అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న 'బాడీగార్డ్" చిత్రంపై ఈ భామ చాలా ఆశల్ని పెట్టుకుంది. ఈ చిత్రం మలయాళ , హిందీ, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించడంతో తెలుగులో ఈ చిత్రం తనకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందనే నమ్మకంతో వుంది త్రిష.


Click it and Unblock the Notifications











