»   » త్రిష బర్త్ డే స్పెషల్ : ‘నాయకి’ (ఫస్ట్ లుక్)

త్రిష బర్త్ డే స్పెషల్ : ‘నాయకి’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలో స్టార్ హీరోయిన్ రేంజి వరకు వెళ్లి ఓ వెలుగు వెలిగిన త్రిష....గత పదేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన హవా కొనాగిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, ఎంత పోటీ ఉన్నా త్రిష మాత్రం తనకు తగిన పాత్రలు ఎంచుకుంటూ నిలదొక్కుకుంటూనే ఉంది.

నేడు (మే 4) పుట్టిన రోజు. పదకొండేళ్ల క్రితం సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ఆమె సుధీర్ఘం కాలం పాటు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికీ త్రిష తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా త్రిష నటించిన కొత్త మూవీ ‘నాయకి' ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

Trisha 'Nayaki' movie first look released

తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా గోవి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పద్మ మామిడి పల్లి సమర్పణలో గిరిధర్ మామిడి పల్లి నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. త్వరలో విడుదల వివరాలు ప్రకటించనున్నారు.

Trisha

మరో వైపు త్రిష బాలయ్యతో నటించిన ‘లయన్' ఈ వారమే విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు తమిళంలో జయం రవితో చేసిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. శింబు హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో కూడా త్రిష ఓ సినిమా చేయబోతోంది.

English summary
Trisha 'Nayaki' movie first look released. The movie directed by Govi.
Please Wait while comments are loading...