ఆ భామలు తిట్టుకున్నా అందమే!
నయనతార, త్రిషాలు గొడవ పడుతున్నారుట. ముఖాముఖి తిట్టుకున్నారట. మాట్లాడుకోవడం మానేసారుట. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా పొసగటంలేదనే విషయం తేటతెల్లమే అయినప్పటికీ ముఖం మీద తిట్టుకోవటం మాత్రం ఇదే మొదలుట. ఇటీవల జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో వీరిద్దరూ పాల్గొన్నప్పటికీ ఒకరివైపు మరొకరు కొరకొరా చూసుకున్నారట. త్రిషాకు వచ్చిన అవకాశాన్ని నయనతార అందిపుచ్చుకోవడమే ఈ గొడవకు కారణమని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అప్పటినుంచే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని సమాచారం. వీరిద్దరూ పాల్గొన్న ఇటీవలి కార్యక్రమమే వీరిద్దరి మధ్య చెడిన సంబంధాలను స్పష్టం చేశాయిట. వీరిద్దరి కొరకొర చూపులను చూసిన వారు అందగత్తెలు తిట్టుకున్నా అందమే అంటూ చెవులు కొరుక్కున్నారట.


Click it and Unblock the Notifications











