తెలుగులో త్రిష కొత్త చిత్రం ప్రారంభం
నిర్మాణ నిర్వాహకుడు పూసల బుజ్జి మాట్లాడుతూ మల్టీస్టారర్ చిత్రాలుగా హీరోలతో సినిమాలు తీస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్లతో మల్టీస్టారర్ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. హీరోయిన్ ఓరియంటెడ్ కథతో ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన స్క్రీన్‌ప్లేతో యువతకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని, ముగ్గురు అమ్మాయిల మధ్య స్నేహం ఎలా సాగింది? వారి మధ్య వచ్చిన పొరపొచ్చాలు ఎలా విడిపోయాయి? అనే కథాంశంతో సినిమా ఉంటుందని తెలిపారు.
దర్శకుడు ఎన్.పాండ్యన్ మాట్లాడుతూ ''తెలుగులో ఇదే నా తొలి చిత్రం. హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాన్ని చేయడం ఆనందంగా ఉంది. ఆధునికతకు ప్రతినిధులు ఆ ముగ్గురు యువతులూ. స్నేహమంటే ప్రాణమిచ్చే ఆ యువతుల జీవితాల్లో చోటు చేసుకొన్న అనూహ్యమైన సంఘటనలు కథను రసకందాయంలో పడేస్తాయన్నారు ''అన్నారు.
పోసాని కృష్ణమురళి, సురేఖావాణి, ధన్‌రాజ్, రఘుబాబు, రవితేజనటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమామ్, కెమెరా: బి.అతిశయరాజు, ఎడిటింగ్: నందమూరి హరి, మాటలు: పూసల, నిర్మాత: పి.వి. ఆర్.రాజు, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎన్.పాండ్యన్.


Click it and Unblock the Notifications












