పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత జూ ఎన్టీఆర్ తోనే హవా...
జూ ఎన్టీఆర్ - త్రిషల కాంబినేషన్ గురించి పలుమార్లు ప్రస్తావన వచ్చినప్పటికి ఎప్పటికప్పుడు ఈ జంటకు జత కట్టే అవకాశం దక్కకుండా పోయింది. అయితే జూ ఎన్టీఆర్ నటించిన గత రెండు, మూడు చిత్రాలకూ తొలుత త్రిషనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల ఆపై వేరే ఆప్షన్స్ వెతుక్కోవడం జరిగింది. కాగా ఈ సారి మాత్రం జూ ఎన్టీఆర్- త్రిష జోడికి అన్నీ కుదిరినట్టేననీ, త్వరలోనే ప్రారంభం కానున్న బోయపాటి శ్రీను చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష ఓ హీరోయిన్ గా ఎంపికైందనీ సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'లవ్ ల్లీ" చిత్రంలో నటిస్తోన్న త్రిషని త్వరలో వెంకీ సరసన 'సావిత్రి"లోనూ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నెక్స్ ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనూ స్ర్కీన్ షేరింగ్ కి త్రిష సై అనేసిందంటే మళ్ళీ కొన్నాళ్ళు టాలీవుడ్ లో తన హవా కొనసాగడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..


Click it and Unblock the Notifications











