1.16 కోట్ల జరిమానా నుంచి తప్పించుకున్న త్రిష!

స్టార్ హీరోయిన్ త్రిషకు మద్రాసు హై కోర్టు నుంచి ఊరట లభించింది. ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో త్రిషపై ఐటి అధికారులు కేసు నమోదు చేసారు. 2010-11 సంవత్సరంలో ఆమె తన ఆదాయపు పన్ను లెక్కలేని రహస్యంగా ఉంచిందని ఈ కేసు నమోదైంది. దక్షిణాదిలో చాలా కాలం పాటు వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఆ సమయంలో త్రిష అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో త్రిష హై కోర్టుని ఆశ్రయించింది. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆదాయవివరాలు దాచిపెట్టిందని, 1.16 కోట్ల జరిమానా విధించాలని ఐటి అధికారులు కోర్టుని కోరారు.

 Trisha not liable to pay Rs 1.16 crore penalty

జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. త్రిష ఉద్దేశపూర్వకంగా ఆదాయ వివరాలు దాచిపెట్టలేదని, అందువలన ఆమె జరిమానా చెల్లించనవసరం లేదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో త్రిషకు ఊరట లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X