భలే ఛాన్స్ లే...కమల్ సరసన త్రిష

By Staff

Trisha
మొత్తానికి త్రిష లక్కీస్టార్ అనిపించుకుంది. తాజాగా కమల్ భారీ ఎత్తున రూపొందించనున్న మర్మయోగి చిత్రానికి ఆమె హీరోయిన్ గా ఎంపికయినట్లు సమాచారం. ముందుగా దశావతారం సినిమాలో చేసిన అసినే మళ్ళీ ఈ సినిమాలో చేయనుంది అనే వార్తలు వచ్చాయి. అయితే కమల్ తన మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాలంటే...స్టార్స్ ని రిపీట్ చెయ్యకూడదని భావిస్తున్నట్లున్నాడని అంటున్నారు. అందులోనూ చిత్రంలో హీరోయిన్ పాత్ర కాస్త నెగిటివ్ టచ్ తో ఉంటుందని సమాచారం. త్రిష కూడా ఈ మధ్య నాకు విలన్ రోల్స్ వెయ్యాలని ఉంది అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చింది.

అంటే కమల్ సినిమాలో పాత్ర తెలుసుకునే ఈ తరహాలో మాట్లాడిందా అన్నట్లు కొందరు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇక కమల్ దర్శకత్వంలో రెడీ అయ్యే ఈ చిత్రంలో ఆయన ట్రేడ్ మార్క్ అయిన లిప్ టు లిప్ కిస్ ఉంటుందా...అనేది కొత్త చర్చ అయితే త్రిష ఆ అవకాశాన్ని పొందనుందా అనేది మరో ప్రశ్న. ప్రస్తుతం త్రిష రవితేజా సరసన సురేంద్ర రెడ్డి సినిమా కోసం,వెంకటేష్,క్రిష్ ల కాంబినేషన్ ఫిల్మ్ లోనూ,నాగార్జున ప్రక్కన కింగ్ లోనూ చేస్తోంది. ఇప్పుడీ అవకాశంతో ఆమె త్వరలో నెంబర్ వన్ అయినా ఆశ్చర్యపడనవసరం లేదనేది విశ్లేషకుల మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X