జూ ఎన్టీఅర్ తో త్రిష తప్పుకుంది..కాజల్ చేరింది

By Srikanya

జూ ఎన్టీఅర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న బృందావనం చిత్రంలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిష తప్పుకుని ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. తాను బాలీవుడ్ చిత్రం కట్టా మీటా లో బిజీగా ఉండి డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని త్రిష చెప్పటంతో ఈ మార్పు తప్పలేదని అంటున్నారు.ఇక మగధీర విజయంతో ఉన్న కాజల్ కి వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. వాటిల్లో పెద్ద హీరోలవే ఓకే చేసి మిగతావి పెండింగ్ లో పెడుతోంది కాజల్. అలాగే ఈ చిత్రాన్ని పైడపల్లి వంశీ డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని రూపొందించారు. భాక్సా ఫీస్ వద్ద పరాజయాన్ని చూసినా ఆ చిత్రంలో టెక్నికల్ గా దర్శకుడు మంచి ప్రతిభ చూపాడని పేరు వచ్చింది. దాంతో జూ ఎన్టీఅర్ పిలిచి కథ విని డేట్స్ ఇచ్చారు. అలాగే మున్నా వర్కవుట్ కాకపోయినా మరోసారి దిల్ రాజు..వంశీకి అవకాశం ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగ్గట్లుగానే ఎంటర్టైనర్ గా కథనం నడుస్తుందని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X