షాకిచ్చిన త్రిష.. ఆచార్య నుంచి అవుట్.. అదే కారణమంటూ ట్వీట్
96 సినిమాతో తమిళ నాట భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది త్రిష. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూనే ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన త్రిష.. కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పింది. సౌత్ బిగ్గెస్ట్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా ఓకే అయింది.
స్టాలిన్ చిత్రం తరువాత చిరంజీవితో ఆచార్యలో నటిస్తుండటంతో అటు త్రిష అభిమానులు, ఇటు చిరు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే అది కచ్చితంగా బ్లాక్ బస్టరేనని, దీంతో త్రిషకు మంచి కమ్ బ్యాక్ చిత్రమవుతుందని అంతా భావించారు. అయితే ఆ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. తాను ఈ చిత్రం నుంచి తప్పుకొంటున్నట్లు త్రిష ప్రకటించింది.

Recommended Video

'కొన్ని సార్లు అన్ని మనం అనుకున్నట్లే జరగవు.. మొదటగా చెప్పినదానికి, చర్చలు జరిపిన దానికి తగ్గట్టే అన్ని జరగవు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా.. చిత్రయూనిట్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా..త్వరలోనే ఓ మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాన'ని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











