»   » భయపెడుతుందా? రెచ్చగొడుతుందా..? నాయకి లో త్రిష ఏం చేస్తుంది??

భయపెడుతుందా? రెచ్చగొడుతుందా..? నాయకి లో త్రిష ఏం చేస్తుంది??

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష విభిన్నంగా నటించిన ద్విభాష చిత్రం నాయకి. ఈ మూవీకి గోవి దర్శకుడు.. జులై ఎనిమిదో తేదిన తెలుగు, తమిళ భాషలో విడుదల కానుంది. దీంతో చిత్ర‌ టీమ్ ప్రమోషన్స్ పరంగా రంగంలోకి దిగింది. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను, ఒకేసారి రెండు భాషల్లోను విడుదల చేయనున్నారు. త్రిష మొదటిసారిగా చేస్తోన్న కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడం .. అందునా హారర్ థ్రిల్లర్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గిరిధర్ నిర్మాణంలో 'గోవి' తెరకెక్కించిన ఈ సినిమాపై త్రిష గట్టి నమ్మకమే పెట్టుకుంది.

ఆమె పద్ధతిగా పట్టుచీర కట్టుకుని వరుస హత్యలు చేస్తూ వెళుతున్నట్టుగా వచ్చిన పోస్టర్స్, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో ఆమె దెయ్యంగా కనిపించనుందని అంటున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో, మరోవార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఆమె దెయ్యంగా మారక మునుపు చాలా గ్లామర్ గా కనిపిస్తుందనీ, ఈ పాత్రలో త్రిష గ్లామర్ డోస్ బాగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది.


Trisha over exposing in Nayaki

అంటే ఒక వైపు భయ పెడుతూనే మరో వైపు గ్లామర్ లో ముంచెత్తుతుందట. అవకాశాలు తగ్గిపోవటంతో కాస్త భారీ గానే ఎక్స్పోజింగ్ కి ఓకే చెప్పిందంటున్నారు.ఆడియో ఫంక్షన్ కి కూడా క్లీవేజ్ కనిపించే డ్రెస్ లో వచ్చి అందరి చూపులూ తనవైపే తిప్పుకుంది.. కచ్చితంగా ఇది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశమే. మొదటిసారిగా త్రిష కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో నటించింది. సోలోగా హారర్ చిత్రాల్లో నటించడం కూడా ఆమెకి ఇదే మొదటిసారి. అందువల్లనే ఈ సినిమా తనకి మరింత ప్రత్యేకమని త్రిష చెబుతోంది.


ఇక ఈ సినిమా విడుదలకు దాదాపు సిద్ధం అవుతుండగానే.. త్రిష మరో హారర్ సినిమాకు రెడీ అయ్యింది. తమిళ దర్శకుడు మాదేష్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం పూర్తి హారర్ మూవీగా రూపొందనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మే నెల చివరివారంలో మొదలయ్యే అవకాశం ఉందట. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఇదీ గ్లామర్ ప్రధానం గా సాగే కథేనట.. సో ఇంకోసారి అందాల ఆరబోతకి రెడీ అయ్యిందన్నమాట...


Trisha over exposing in Nayaki

ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను లండన్ నగరంలో తీయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాయకి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది ఈ అమ్ముడు. మరి నాయకి విడుదలైన తరువాత ఆ సినిమా రిజల్ట్‌ను బట్టి మరో హారర్ సినిమా చేస్తే బాగుండేది అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఏదేమైనా త్రిష మాత్రం ఎలా అయినా సరే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఎక్స్పోజింగ్ కీ నతనకీ సంబందం ఉండదని త్రిష కి ఎవరైనా చెబితే బావుండు....

English summary
The Pretty women of South India, Trisha Krishnan is currently doing her upcoming horror comedy, which is her first ever female-centric trilingual film titled Nayaki..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu