నాగ్ సరసన త్రిషా?
నాగార్జున హీరోగా శ్రీను వైట్ల సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న డాన్ విడుదల అయిన తరువాత ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ కావచ్చు. నాగార్జున మిత్రుడు శివప్రసాద్ రెడ్డి శ్రీ కామాక్షి మూవీస్ పతాకంపై ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇప్పటికే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











