మన్మథునితో రొమాన్స్ చేయడానికి త్రిష మళ్ళీ రెడీ...
'కింగ్" చిత్రంతో యువసామ్రాట్ నాగార్జున సరసన నటించిన చెన్నై చిన్నది త్రిష..తాజాగా వెంకట ప్రభు దర్శకత్వంలో నాగ్, అజిత్ లతో తమిళ, తెలుగు భాషల్లో రూపొందించబోతున్న చిత్రంలో మరోసారి నాగ్ తో జతకట్టనుంది. అయితే మొదట ఈ చిత్రానికి నీతూ చంద్రను ఎంపిక చేసినప్పటికి, ఆమె పాకిస్థాన్ క్రికెటర్ తో ఎఫైర్ ఉందనే ఫిక్సింగ్ లో ఇరుక్కుపోవడంతో త్రిషను తీసుకున్నారనీ తెలుస్తోంది.,br />
అజిత్, నటించే మల్టీస్టారర్ చిత్రంలో నాగ్ తమిళంలో ప్రధాన పాత్ర పోషించగా, అజిత్ హీరోగా నటిస్తారు. తెలుగులోకి వచ్చేసరికి అజిత్ ప్రధాన పాత్ర పోషించగా, నాగార్జున హీరోగా నటిస్తారు. మిగతా వారి క్యారెక్టర్స్ రెండు భాషల్లోనూ ఒకేలా ఉంటాయి. హీరోయిన్ కూడా ఒకరే ఉంటారు. ప్రస్తుతం నాగ్ నటిస్తున్న 'గగనం" చిత్రం దాదాపుగా పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉండగా, వీరు పోట్ల దర్శకత్వంలో నటిస్తున్న 'రగడ" డిసెంబర్ లో ప్రేక్షకుల ముందకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











