»   » నయనతార, త్రిష ఇలా పార్టీ చేసుకున్నారు (ఫోటోలు)

నయనతార, త్రిష ఇలా పార్టీ చేసుకున్నారు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇద్దరూ ఈ మధ్య తరచూ కలుస్తూ పార్టీ చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య గతంలో విబేధాలు ఉండేవి. అప్పట్లో వీరి మధ్య ఓ రేంజిలో కాంపిటీషన్ ఉండటమే అందుకు కారణం. అయితే రాను రాను ఇద్దరూ విబేధాలు వీడి ఫ్రెండ్స్ అయ్యారు.

ఇటీవల త్రిష, నయనతార కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలు కూడా పోస్టు చేసింది. ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ఆ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఇద్దరితో పాటు వారి కామన్స్ ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీరికి సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో.....

నయనతార గురించి త్రిష ట్వీట్

నయనతార గురించి త్రిష ట్వీట్


నయనతార గురించి త్రిష తన ట్విట్టర్లో కామెంట్ చేసింది. "Nuthn lik d good ol fashioned gals nite out." అంటూ నయనపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి..

కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి..


తమ కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నయనతార, త్రిష. అంతా కలిసి ఇటీవల చెన్నైలో నైట్ పార్టీలో రిలాక్స్ అయ్యారు.

గతంలో విబేధాలు

గతంలో విబేధాలు


గతంలో ఇద్దరి మధ్య విబేధాలు ఉండేవి. గతంలో విజయ్ హీరోగా వచ్చిన ‘కురువి' అనే సినిమా విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ సినిమాలో అప్పట్లో తొలుత త్రిషను అనుకున్నారు. అయితే నయనతార సీన్లోకి రావడంతో ఆమెను తప్పించారు.

ఎవరి సినిమాల్లో వారు బిజీబిజీ

ఎవరి సినిమాల్లో వారు బిజీబిజీ


ప్రస్తుతం నయనతార, త్రిష ఎవరి సినిమాల్లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు. నయనతార ‘అనామిక' అనే తెలుగులో సినిమాతో పాటు మరొక తమిళ సినిమాలో నటిస్తుండగా, త్రిష తెలుగులో ‘రంభ ఊహ్వశి మేనక', తమిళంలో బూలోగం అనే చిత్రంలో నటిస్తోంది.

English summary
Who said two top actresses can't be friends? Look at Trisha Krishnan and Nayantara, who has been maintaining a warm relationship for a long time. The South girls proved it again recently by partying hard in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu