ముఖ్యమంత్రి వేషం కడుతున్న త్రిష...!?
అందాలతార త్రిష కన్నడ చిత్ర పరిశ్రమపై కన్నేసింది. అక్కడ ఒక భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది కూడా. శివరాజ్ కుమార్ తో కలిసి నటించనుంది. ఇందులో ముఖ్యమంత్రిగా చెన్నై సోయగం త్రిష నటించనుంది. ఇది ఒక సాధారణ వ్యక్తికి, ఇద్దరు ముఖ్యమంత్రులకు మధ్య జరిగే కథతో తెరకెక్కనుందట. శివరాజ్ కుమార్ హీరోగా నటించే ఈ చిత్రంలో మొదట ఈ కథానాయిక పాత్రకు అనుష్కను సంప్రదించారు.
అయితే, ఆమె డేట్స్ లభ్యంకాకపోవడంతో ఆ చాన్స్ త్రిషకు దక్కింది. ఇందులో నటిస్తున్నందుకు త్రిష ఎనభై లక్షలు చార్జ్ చేస్తోందట. దర్శక నిర్మాత రఘురాం రూపొందిస్తున్న ఈ చిత్రానికి 'సిఎం' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ వెర్షన్లో హీరోగా అర్జున్ నటిస్తాడని సమాచారం.


Click it and Unblock the Notifications











