వెంకటేష్ బాడీగార్డ్ గా హాట్రిక్ కొట్టిన త్రిష...!
మలయాళ సినిమా 'బాడీగార్డ్" తెలుగు రీమేక్ లో వెంకటేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 'డాన్ శీను" చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్నాడు. వెంకటేష్ సరసన మళ్లీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బాడీగార్డ్' ఆధారంగా రూపొందే చిత్రంలో తాజాగా త్రిషని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో దిలీప్, నయనతార జంటగా నటించారు.
ఇదే సినిమా తమిళ రీమేక్ లో విజయ్, అసిన్ జత కట్టారు. హిందీ వర్షన్ లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్నారు. మరి తెలుగులలో వెంకీ సరసన త్రిష కథానాయికగా ఎంపికయ్యింది.ఇందులో మొదట్లో నయనతార, ఆ తర్వాత ప్రియమణి నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, చివరికి త్రిషే ఒకే అయింది. వచ్చే నెలలో దీని షూటింగుని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గతంలో వెంకీ, త్రిష కలిసి 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే', 'నమో వేంకటేశ' సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. సో ముచ్చటగా మూడోసారి వెంకటేష్ సరసన త్రిష ఈ సినిమాతో హాట్రిక్ సాధించబోతోంది.


Click it and Unblock the Notifications











