»   »  త్రిష-రానా......క్లోజ్ గా ఉంటే అంతేనా? ఈ పుకార్లేంటి?

త్రిష-రానా......క్లోజ్ గా ఉంటే అంతేనా? ఈ పుకార్లేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష, రానా మధ్య ఎఫైర్ ఉందంటూ గతంలో చాలా సార్లు రూమర్లు స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వారు మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అని పలు సందర్భాల్లో స్పష్టం చేసారు. త్రిష ఎంగేజ్మెంట్ వరుణ్ మణియన్ తో జరుగడంతో వీరిపై వస్తున్న రూమర్లకు తెర పడినట్లయింది.

అయితే వరుణ్ మనియన్ తో త్రిష బ్రేకప్ చేసుకోవడం, ఎంగేజ్మెంట్ రద్దు చేయడంతో మళ్లీ వీరిపై పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అసలు త్రిష ఎంగేజ్మెంట్ రద్దు కావడానికి రానా కూడా ఓ కారణమనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ఈ ఇద్దరూ మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో పాల్గొన్నారు.

Trisha And Rana Bond At Manchu Manoj's Sangeet Party

అయితే రూమర్లకు చోటు ఇవ్వకుండా రానా, త్రిష జాగ్రత్త పడుతున్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఫోటోలో కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు స్ప్రెడ్ కాకుండా కేర్ తీసుకుంటున్నారు. తాజాగా మంచు మనోజ్ వెడ్డింగ్ సెర్మనీలో కూడా ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు.

Trisha And Rana Bond At Manchu Manoj's Sangeet Party

సాధారణంగా స్నేహితులన్నాక క్లోజ్ గానే ఉంటారు. అయితే సినిమా రంగానికి చెందిన వారు కావడంతో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూస్తుంటారు కొందరు. గత అనుభవాల దృష్ట్యా పలు పాఠాలు నేర్చుకున్న రానా, త్రిష అనవసర రూమర్లకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే మనోజ్ ఎంగేజ్మెంటులో ఇద్దరూ కలిసి ఫోటోలు ఫోజులు ఇవ్వలేదు. వీలైనంత ఎక్కువ గ్యాప్ మెయింటేన్ చేసారు.

English summary
Trisha and Rana Daggubati has always been the hot and happening duo of South cinema. Be it an individual controversy or their infamous alleged relationship-break up and post break up saga, they are always the favorites of gossip columns
Please Wait while comments are loading...