రాణా-త్రిష వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ...!
చెన్నయ్: దగ్గుబాటి యువ హీరో రాణాపై తరచూ ఏదో ఒక రూమర్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆ మధ్య ఈ హీరో బిపాసా బసుతో సంథింగ్ సంథింగ్ చేశాడని, పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాణాకు త్రిషకు మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పు మంటున్నాయి. ఇటీవల ఈ వార్తలను ఇరువురూ ఖండించినా రూమర్లు మాత్రం ఆగడం లేదు.
తాజాగా ప్రచారంలోకి వచ్చిన వార్త ఏమిటంటే రాణా-త్రిష వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని. ఇటీవల రాణా సిస్టర్ మాలవిక ఎంగేజ్‌మెంట్ వేడుకకు త్రిష హాజరవ్వడం, వాళ్ల ఫ్యామిలీతో చాలా కలిసి పోవడంతో ఈ రూమర్లు గుప్పుమన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో త్రిషతో రాణా పెళ్లి ఉంటుందని, అదే ఏడాది పెళ్లి జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
త్రిష నెం.1 స్థానం నుంచి కిందకి దిగజారడంతో ఇక పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకుంటోందట. నా జీవితంలో స్పెషల్ వ్యక్తి ఉన్నాడని, త్వరలోనే అతని పేరు చెబుతానని తన సన్నిహితులతో అంటోందట. ఈ నేపథ్యంలో ఆమె ఈ మధ్య రాణాతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ....ఇలాంటి రూమర్లు ఇద్దరికీ మంచి పబ్లిసిటీ తెచ్చిపెడతాయనడంలో సందేహం లేదు. ఇద్దరికీ ఈ మధ్య సక్సెస్‌లు అనేవి లేవు. ఈనేపథ్యంలో ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయడం ద్వారా జనాలు తమని మరిచి పోకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని వాదించే వాళ్లు కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











