మూడు కండీషన్స్ తో హీరోయిన్ ను కలుసుకొనే ఛాన్స్...!?
తనను కలవడానికి వచ్చే అభిమానులకు త్రిష మూడు కండిషన్లు పెడుతుందట. సెల్ ఫోన్ లో తనని ఫోటో తియ్యకూడదన్నది మొదటి కండిషన్. రూపాయి నోట్ల మీద ఆటోగ్రాఫ్ అడగకూడదన్నది రెండో కండిషన్. ఖాళీ పేపర్ మీద సంతకం అడగకూడదన్నది మూడో కండిషన్.
సెల్ ఫోన్ లో ఫోటో తీసి, వేరే రకంగా ఉపయోగిస్తారేమోననే భయంతోనే త్రిష ఆ కండిషన్ పెట్టి ఉంటుంది. అలాగే రూపాయి నోటు విలువైనది కాబట్టి..అందులో సంతకం పెట్టనని చెప్పి ఉంటుంది. ఖాళీ పేపర్ లో సంతకం పెడితే మిస్ యూజక చేస్తారనే భయంతోనే త్రిష ఆ నిబంధన విధించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రీసెంట్ గా త్రిష- అజిత్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'మంకత్తా' చిత్రాన్ని గ్యాంబ్లర్ గా తెలుగులోకి అనువదించి, తెలుగులో కూడా విడుదల చేసిన విషయం విధితమే. అయితే తమిళంలో అయినంత హిట్ టాలీవుడ్ లో సాధించలేకపోయింది. యువ కథానాయికల జోరులో ఈ మధ్యకాలంలో కొంత వెనకబడిపోయిన త్రిష తెలుగులో తాజాగా వెంకటేష్ సరసన 'గంగ ది బాడీగార్డ్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. త్వరలో త్రిష దమ్ము షూటింగ్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష ఎన్టీఆర్ తో జత కట్టడం ఇదే తొలిసారి.


Click it and Unblock the Notifications











