»   » మహేష్ బాబు ట్వీట్ చేసిన ఆరేళ్ల తర్వాత... త్రిష స్పందన!

మహేష్ బాబు ట్వీట్ చేసిన ఆరేళ్ల తర్వాత... త్రిష స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ గురించి త్రిష తాజాగా స్పందించారు. అప్పుడు మహేష్ బాబు చేసిన ట్వీట్ త్రిష చూడలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ ట్వీట్ త్రిష కంట పడింది. దీంతో అప్పుడు దీన్ని నేను ఎలా మిస్సయ్యానో? అంటూ కాస్త విచారం వ్యక్తం చేసిన త్రిష..... ఆ విషయాన్ని ఇపుడు అభిమానులతో పంచుకుంది.

2010లో మహేష్ బాబు ట్విట్టర్లో ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఓ అభిమాని ట్విట్టర్లో మీకు ఇష్టమైన కో-స్టార్‌ ఎవరని అడిగిన ప్రశ్నకు మహేశ్‌ సమాధానం ఇచ్చారు. త్రిష, అనుష్క తనకు ఇష్టమైన కో-స్టార్సని ట్వీట్‌ చేశారు.

ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే త్రిష ఎలా మిస్సయిందో తెలియదు కానీ... మహేష్ బాబు ట్వీట్ మిస్సయింది. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్, ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఆయన తన‌కు ఇష్టమైన కోస్టార్ అంటూ చెప్పిన రెండె పేర్లలో తన పేరు కూడా ఉండటంపై చాలా హ్యీపీగా ఉంది త్రిష.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబుహీరోగా తెరకెక్కిన 'అతడు' చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు, త్రిష మధ్య వచ్చే సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమాలో త్రిష పెర్ఫార్మెన్స్ హైలెట్. ఇప్పటికీ ఆ సీన్ల కోసమే చాలా మంది 'అతడు' సినిమా చూస్తారంటే అతిశయోక్తి కాదేమో. దీంతో పాటు సైనికుడు చిత్రంలో కూడా మహేష్ బాబుతో కలిసి త్రిష నటించింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమాల్లో అవకావం దక్కించుకోలేక పోయింది త్రిష.

త్రిష ట్వీట్

త్రిష ట్వీట్

మహేష్ బాబు ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ గురించి ఇపుడు త్రిష ఇలా స్పందించింది.

మహేష్-త్రిష కామెడీ సీన్

మహేష్ బాబు, త్రిష జంటగా నటించి మూవీలోని కామెడీ సీన్.

సైనికుడు ఫన్నీ సీన్

సైనికుడు సినిమాలో మహేష్ బాబు, త్రిష మద్య సాగే ఫన్నీ సీన్

లవ్ సీన్స్

అతడు సినిమాలో మహేష్ బాబు, త్రిష మద్య వచ్చే లవ్ సీన్స్

English summary
Despite the celebrities stay connected through Social media platforms, Superstar Mahesh Babu prefers to stay recluse and hardly seen active on social media networks. Mahesh Babu started his Twitter account just before the release of ‘Khaleja‘ in 2010. Responding one of the tweets by a fan, Mahesh responded his favorite heroines as Trisha and Anushka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu