ఎన్టీఆర్ 'దమ్ము'లో తన పాత్ర గురించి త్రిష
ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో త్రిష ఓకే అయిన సంగతి తెలిసిందే.ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...నేను ఎన్టీఆర్ తో ఇంతకుముందు రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది కానీ అవి మెటీరియలైజ్ కాలేదు. ఎన్టీఆర్ తో పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే బోయపాటి శ్రీను తో కూడా. ఇఖ ఈ చిత్రం నా పాత్ర.. మూడు రకాలుగా విభిన్నంగా సాగుతుంది. అందులో ఒకటి నేను రెగ్యులర్ గా చేసేది అంది త్రిష.ఇక దమ్ము చిత్రంలో శృతి ప్లేసులోకి త్రిషను తీసుకున్నారు.రెండవ హీరోయిన్ గా కార్తికని పైనలైజ్ చేసారు.
దమ్ము చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలు కానుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రంలో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











