పాపం..త్రిషను ఒక్క తన్ను తన్నారు
బాలీవుడ్ లో అడుగుపెట్టగానే ఇన్నాళ్ళూ ఆశ్రయమిచ్చిన తెలుగు ఫీల్డుని చిన్నచూపు చూసి మాట్లాడిన త్రిషకు అక్కడ తీవ్ర అవమానమే ఎదురైంది. ఆమె ఎంతగానో ఆశలు పెట్టుకుని చేసిన కట్టా మీటా నిన్న(జూలై 23) రిలీజై ఫ్లాఫ్ గా భాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దానికి తోడు రివ్యూలన్నీ త్రిష చిత్రానికి మైనస్ అని తేల్చాయి. దాంతో త్రిషను తమ చిత్రాల్లో బుక్ చేసుకుందామనుకునే హిందీ నిర్మాతలు ఆలోచనలో పడే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ గెటప్ మార్చి ఆమె బాలీవుడ్ ని ఆకర్షిద్దామని చేసిన ప్రయత్నాలు అన్నీ నేల పాలయ్యాయి. అసిన్ కి పోటీ ఇద్దామని వచ్చిన ఈ ముద్దుగుమ్మకి గురువు ప్రియదర్శన్ అవకాశమిచ్చి సాయించేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందులోనూ ప్రమోషన్ కి రాకుండా త్రిష మొండికేయటంతో హీరో అక్షయ్ కుమార్ సైతం మండిపడుతున్నాడు. దాంతో పాపం త్రిష అని బాలీవుడ్ వ్యంగ్యంగా నవ్వుకుంటోంది.
More from Filmibeat
త్రిష కట్టా మీటా అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ నమో వెంకటేశ కింగ్ trisha khatta meetha priyadarshan namo venkatesa king


Click it and Unblock the Notifications











