త్రిష లీక్ చేసిన ఎన్టీఆర్ 'దమ్ము' ఫోటో
ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో ఎన్టీఆర్ తో తాను చేస్తున్న దమ్ము చిత్రంలోని ఓ ఫోటో ని ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో త్రిష,ఎన్టీఆర్,కార్తీక ఉన్నారు. ఇద్దరు మధ్య ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్,త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దమ్ము'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సినిమా విషయమై నిర్మాత అలెగ్జాండర్ వల్లభ మాట్లాడుతూ ''కీరవాణి అందించిన బాణీలు బాగున్నాయి. మాస్‌ని తప్పకుండా అలరిస్తాయి. ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన శ్లోకం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్ నృత్యాల కోసం చాలా కష్టపడ్డారు. అదంతా తెరపై కనిపిస్తుంది. ఈ నెల 29న విడుదల చేస్తున్నాం ''అని చెప్పారు.
ఇక ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. అలాగే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా కార్తీక చేస్తోంది. ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. పోలీస్ అధికారిగా,ఫ్యాక్షనిస్టుగా ఎన్టీఆర్ విభిన్న షేడ్ లలో చూపే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపాడేస్తాయని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, రంగనాథ్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: కేఎస్ రామారావు.


Click it and Unblock the Notifications











