మోహిని ట్రైలర్: త్రిష విశ్వరూపం, షి ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్!
Recommended Video

తెలుగు, తమిళ భాషల్లో త్రిష ఒక్కప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. హద్దులు దాటని గ్లామర్, అద్భుతమైన నటనతో త్రిష క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. చాలా కాలం పాటు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా త్రిష కొనసాగింది. 35 ప్లస్ లో ఉన్న ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రావడం లేదు. అరాకొరా చిత్రాలు ఉన్నప్పటికీ అవి లేడి ఓరియంటెడ్ రోల్స్ కావడం విశేషం. చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన త్రిష నటించిన మొహిన్ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజగా మోహిని చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

అతీంద్రియ శక్తులు
మోహిని చిత్రం అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ట్రైలర్ చూస్తుంటే హర్రర్ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. ట్రైలర్ లో త్రిష అన్ని రకాల నటనని చూపించారు. రొమాంటిక్,స్టైలిష్, హర్రర్ లుక్స్ లో త్రిష అదరగొడుతోంది.
వేల సంవత్సరాలుగా
ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చిపెటబడిన నిజం అంటూ ఆసక్తికరంగా టట్రైలర్ ఆరంభం అవుతుంది. పోలీసులే ఆ బాడీని కనిపెట్టలేకపోయారు అనే సంభాషణ కూడా వినిపిస్తోంది. చూస్తుంటే ఈ చిత్రం హర్రర్ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా సాగబోతున్నట్లు తెలుస్తోంది.

గ్రాఫిక్స్ అదుర్స్
హర్రర్ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో కూడా అబ్భురపరిచే గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసినట్లు ఉన్నారు. త్రిష మోహినిగా ఎలా మారింది. ఆమె పగ ఎవరిపై వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

జులై 27న
మోహిని చిత్రం తెలుగు తమిళ భాషల్లో జులై 27 న విడుదల కాబోతోంది. దర్శకుడు మాదేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేసే విధంగా ఉంది.


Click it and Unblock the Notifications











