»   » త్రిషకు భద్రత కావాలి...పోలీస్‌ కమిషనర్‌కు తల్లి ఉమ విజ్ఞప్తి

త్రిషకు భద్రత కావాలి...పోలీస్‌ కమిషనర్‌కు తల్లి ఉమ విజ్ఞప్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జల్లికట్టు వ్యవహారంలో తమ కుమార్తె, నటి త్రిషకు బెదిరింపులు వస్తున్నాయని, ఆమెకు భద్రత కల్పించాలని త్రిష తల్లి ఉమ సోమవారం చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. పెటా సంస్థలో ఉన్న త్రిష జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ట్విటర్‌లో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అయితే తన ట్విటర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని,

తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని త్రిష వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్రిష తల్లి ఉమాకృష్ణన మీడియాతో మాట్లాడుతూ.. తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టుకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, త్రిష పలు భాషల చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందని, ఆమె ఎన్నడూ పెటా సంస్థకు మద్దతుగా ప్రచారం చేయలేదని అన్నారు.

త్రిష తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన నేపద్యంలో అప్పటినుంచి త్రిష పై సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.. కొందరు త్రిష మరణించింది అని ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించారు కూడా.. కాగా ఈ విషయంపై త్రిష స్పందిస్తూ.. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని.. తాను జల్లికట్టుకి వ్యతిరేకంగా ఏమీ పోస్ట్ చేయలేదని.. హ్యాక్ చేసిన వారు తన పేరుతో కామెంట్స్ పోస్ట్ చేశారని తెలిపింది.. అంతేకాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి తన ట్విట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేసింది.

Trisha's Mother Seeks Police Protection For Trisha Over Jallikattu Row

జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటి త్రిష చనిపోయినట్లు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ ఫొటోను త్రిష ట్వీట్‌ చేస్తూ ఘాటుగా స్పందించారు. ఆ ఫొటో చూసి షాక్‌ అయ్యింది త్రిష. సామాజిక మాధ్యమాల్లో ఇలా అసభ్యకరమైన భాష ఉపయోగించి ఏమైనా పోస్టు చేస్తారా? అని మండిపడింది ఆమె. మహిళలు, వారి కుటుంబాలను అగౌరవపరచడమేనా తమిళ సంప్రదాయమంటే అని ప్రశ్నించింది త్రిష. ఇలాంటి వారికి తమిళ సంప్రదాయం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. జల్లికట్టును వ్యతిరేకించే విషయంలో భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది త్రిష.

త్రిష, ఈ ప్రచారం చేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఆమె షూటింగ్ ను అడ్డుకున్నారు. దక్షిణ చెన్నైకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని శివగంగలో ఆమె నటిస్తున్న 'గర్జన' చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కడికి వెళ్లిన 'జల్లికట్టు' మద్దతుదారులు ఆ షూటింగ్ ను అడ్డుకున్నారు.

కార్వాన్ లో ఉన్న త్రిషను బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లడంతో పరిస్థితి చక్కబడింది. జల్లికట్టుకు తాను వ్యతిరేకం కాదని త్రిష ప్రకటించినా.. జల్లికట్టు మద్దతుదారులు మాత్రం ఆమె మాటలను నమ్మే స్థితిలో లేరు. త్రిష నిజంగానే జల్లికట్టుకు వ్యతిరేకం కాకపోతే.. తక్షణం పెటాను వదిలి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే నటి కుష్బూ సైతం పెటాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మొత్తానికి.. అటు పోయి, ఇటు పోయి తన మెడకు చుట్టుకున్న వివాదంతో కాస్త వెనక్కి తగ్గిన త్రిష నష్టనివారణ చర్యగా తన అకౌంట్ హ్యాక్ అయ్యింది అనీ, జల్లికట్టుకి వ్యతిరేకంగా పోస్ట్ చేయలేదనీ చెప్పటానికీ ప్రయత్నించి అప్పటికీ వ్యతిరేకత తగ్గక పోవటం తో ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసింది.

కాగా, తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జాతి వ్యతిరేక సంస్థ పెటాను తక్షణమే రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. భారత జంతు సంక్షేమ సంస్థను కూడా రద్దు చేసి, రాష్ట్ర ప్రతినిధులకు సభ్యత్వం ఉండేలా కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. మరోవైపు స్టాలిన్‌ డిమాండ్‌ను పెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. జంతువులపై ప్రేమ, దయ చూపడం జాతి వ్యతిరేకమవుతుందా అని పెటా ఇండియా సంస్థ వెటర్నరీ డైరెక్టర్‌ మణిలాల్‌ వల్లియాతే ప్రశ్నించారు.

English summary
After Jallikattu post, Trisha's mother seeks police protection for daughter. She also said the actor's account was hacked.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu