»   »  వీడియో : త్రిష ‘నాయకి’ మోషన్‌ పోస్టర్‌

వీడియో : త్రిష ‘నాయకి’ మోషన్‌ పోస్టర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రిష ప్రధాన పాత్రలో తమిళ,తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నాయకి'. గోవర్ధన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల త్రిష విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. అదే విధంగా వీడియో లింక్‌ను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఈ చిత్రానికి గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేష్‌, జయప్రకాశ్‌, కోవై సరళ, మనోబాల తదితరులు ‘నాయకి' చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాష అనేది సంబంధం లేకుండా అన్ని భాషల్లో స్టార్‌డామ్‌ సంపాదించుకున్న నటి త్రిష. ఇండస్ట్రీకి వచ్చి పదమూడేళ్లయినా ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న త్రిష, 'నాయకి' పేరుతో ఈ హర్రర్‌ కామెడీ సినిమా చేస్తోంది.

హర్రర్‌ కామెడీకి తెలుగు, తమిళంలో మంచి క్రేజ్‌ ఉన్న నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆ కోవలో ఓ మంచి సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు త్రిష. ఇక నాయకి సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల కాగా, ఈ పోస్టర్ కు అంతటా సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

Trisha's Nayaki Telugu Motion Song Poster

డిఫరెంట్‌ స్టైల్లో కనిపిస్తోన్న త్రిషకు అభినందనలు వెల్లువెత్తాయి. తనను నమ్మి ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్‌ చెబుతూ ఈ సినిమా ద్వారా తన కెరీర్లో మరో మంచి పాత్ర రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రఘుకుంచె ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ పూర్తికానుందని తెలుస్తోంది.


సత్యం రాజేశ్, కోవై సరళ, జయప్రకాశ్, గణేశ్‌వెంకట్రామన్, మనోబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రిష నటించిన కళావతి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

English summary
Nayaki Telugu Motion Song Poster ft Trisha and Ganesh Venkatraman, exclusively on Giridhar Productions. Music composed by Raghu Kunche. Directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu