'నేనేరా ఆది' అంటూ రెచ్చిపోతున్న త్రిష
త్రిషకు కెరిర్ చివరి దసకు వచ్చేసినా ఆమె డబ్బింగ్ సినిమాలు మాత్రం ఆమె ఉనికిని తెలుగు వారికి గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు అజిత్ నటించిన గ్లాంబ్లర్ చిత్రం విడుదలైంది.అందులో ఆమె హీరోయిన్ గా చేసింది. ఇక ఇదే స్పూర్తితో.. విజయ్, త్రిష కాంబినేషన్ లో రుపొందిన ఓ తమిళ చిత్రం ఇప్పుడు తెలుగులో 'నేనేరా ఆది' పేరుతో అనువాదమవుతోంది. రమణ దర్శకత్వం వహించారు. అభి పిక్చర్స్ పతాకంపై బి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం డబ్బింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత బి.సత్యనారాయణ మాట్లాడుతూ, 'తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే ఇతివృత్తంతో ఆద్యంతం ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో దీనిని రూపొందించారు. తమిళనాట విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందన్న నమ్మకం ఉంది. గతంలో మేము ప్రేక్షకులకు అందించిన 'దోపిడీ', 'రగిలే కసి' చిత్రాలు మంచి లాభాలను అందించాయి. కొత్తదనాన్ని ఆదరించే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకాష్‌రాజ్, సాయికుమార్‌ల నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సంగీత దర్శకుడు విద్యాసాగర్ అందించిన సంగీతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం పాటలు తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. త్వరలో అన్నికార్యక్రమాలను పూర్తిచేసి, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో వివేక్, నాజర్, మణివన్నన్, సీత తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, ఛాయాగ్రహణం: ఎస్.సుందర్‌రాజన్, సమర్పణ: బి.ఎన్.ఎల్.రాజేశ్వరి, నిర్మాత: బి.సత్యనారాయణ, దర్శకత్వం: రమణ.ఇక తెలుగులో త్రిష ప్రస్తుతం వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలగు చిత్రం. వీటితో పాటు ఆమె బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసం కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రం టైటిల్ హరహర మహాదేవ. వీటితో పాటు విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది.ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే..దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది.


Click it and Unblock the Notifications











