అందాలు ఆరబోస్తేనే చూస్తున్నారంటున్న త్రిష
ప్రముఖ హీరోయిన్ త్రిష తనకు ఏ డ్రగ్ ముఠాతో సంబంధం లేదని వాపోతోంది. మాదక ద్రవ్య ముఠాలతో త్రిషకు సంబంధం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై త్రిష స్పందించారు. మాదక ద్రవ్య ముఠాలతో తనకు సంబంధాలను ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. మాదక ద్రవ్య ముఠాతో తనకు సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
తాను ఏ పాపమూ ఎరగనని అన్నారు. కొందమంది ఉద్దేశ్య పూర్వకంగానే తనపై ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని వాపోయారు. ఇలాంటి వార్తలు తనకు తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయన్నారు. ఇక నటన విషయంలో పాతతరం నటీమణులతో ఈ తరం నటీమణులను పోల్చవద్దని కోరారు. పాతతరం హీరోయిన్లనుంచి ప్రేక్షకులు కేవలం నటన మాత్రమే ఆశించే వారని కాని నేటి ప్రేక్షకులు అందాలు ఆరబోస్తేనే సినిమాలను హిట్ చేస్తున్నారని అన్నారు. అందాల ఆరబోతనటీమణులకు తప్పటం లేదన్నారు.


Click it and Unblock the Notifications











