ఆ రకంగా తనే ట్రెండ్ సెట్టర్ అంటోంది త్రిష
నేను హీరోయిన్ అయిన కొత్తలో... అంటే తొమ్మిదేళ్ల క్రితం హీరోయిన్లందరూ బొద్దుగా ఉండేవారు. ఆ ట్రెండ్‌ని రూపుమాపి, కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఓ విధంగా నేను క్రియేట్ చేసిందే అంటూ గర్వంగా చెప్తోంది త్రిష. అలాగే తాను ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాను కాబట్టే నాకు హిట్స్ వస్తున్నాయి అంది. చెన్నయ్‌లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియా తో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే తనలో తనకు నచ్చే అంశం ఏంటి అంటే ఆత్మ విశ్వాసం. అదే నన్ను ఈ స్థాయికి తెచ్చింది అంది. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకటేష్ సరసన బాడీగార్డ్ సినిమా, తమిళంలో అజిత్‌తో మంగత్తా సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











